అభివృద్ధితోపాటు సంక్షేమం అందిస్తున్న కూటమి ప్రభుత్వం
మొదటి తారీకునే 98 శాతం పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రణాళికలు
తణుకు నాలుగో వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంతో పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తణుకులోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే దాదాపు 98 శాతం పెన్షన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెలలో ఒకటో తేదీ సెలవు దినం వస్తే ముందు రోజు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో 35 వేలకు పెన్షన్లు పైగా సుమారు రూ. 150 కోట్లు పైగా అందజేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎండ వచ్చినా, వర్షం వచ్చినా పెన్షన్లు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రతి నెల మొదటి రోజు పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా పెన్షన్లు నమోదు చేసుకునే వారికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటూ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అందిస్తూ పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు పెంచి అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..