వైద్యులు ప్రాణదాతలు – మంత్రి కందుల దుర్గేష్

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

ఆరోగ్యకర సమాజ స్థాపనలో వైద్యుల పాత్ర కీలకమని పేర్కొన్న మంత్రి దుర్గేష్

సమాజహితమే ధ్యేయంగా వైద్యులు పనిచేయాలని సూచన

నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్

ప్రాణం పోసే వాడు దేవుడైతే, ప్రాణాలను నిలబెట్టేవాళ్లు వైద్యులని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జులై1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులందరికీ మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం నిడదవోలు పర్యటనకు వెళ్లిన మంత్రి దుర్గేష్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులను కలిశారు. టీబీ భయం త్వరగా అంతమవ్వాలని, టీబీ నుండి జీవితాన్ని రక్షించుకోవచ్చని తెలిపే జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పోస్టర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిడదవోలులో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యసమాజ స్థాపనలో వైద్యుల పాత్ర కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైద్యుడు సరైన చికిత్స అందిస్తే మరో జన్మ పొందినట్లవుతుందన్నారు. అందుకే వైద్యో నారాయణ హరి అని వైద్యున్ని దేవుడితో పోలుస్తారని పేర్కొన్నారు.సరైన సమయంలో సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడే మహోన్నత వ్యక్తులు డాక్టర్లు అని అన్నారు. వైద్యులు సమాజసేవలో ఇదే స్థాయిలో ముందుకు వెళ్లాలని కోరారు. సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పనిచేయాలని సూచించారు.యువ వైద్యులు తమ వృత్తిని దైవంగా భావించి సమర్థవంతంగా పనిచేసి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

Scroll to Top
Share via
Copy link