తణుకు రోటరీ క్లబ్ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో రొ. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ రొ.డాక్టర్ వై.కళ్యాణ చక్రవర్తి నూతన అధ్యక్షునిగా రో. కలగర వెంకటకృష్ణను ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు రోటరీ క్లబ్ గత సంవత్సరం సాధించిన విజయాలు కొత్త సంవత్సరానికి వేసుకున్న ప్రణాళికలు అభినందనీయమని అన్ని విషయాలలో తణుకు రోటరీ క్లబ్ వారికి తన వంతు సహాయం పూర్తిగా అందిస్తానని అన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ రో.ఆర్ .వి. అప్పారావు పాల్గొని మనమంతా చేయి చేయి కలిపి సమాజానికి మరింత సేవ చేయాలని క్లబ్ హాజరు శాతం పెరగాలని కార్యక్రమాలు మాన్యుమెంటల్గా ఉండాలని అన్నారు. స్థానిక కార్యక్రమాల బట్టే గవర్నర్ నుండి గాని రోటరీ ఇంటర్నేషనల్ నుండి గాని మన ప్రాజెక్టులకు నిధులు రాబట్టుకోగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ రాజు, జి. సుధాకర్, మల్లిన అరుణ సారథి, అక్కిన కాశీ విశ్వనాథం, వై.బాబూరావు, డాక్టర్ రవికుమార్, ప్రగతి రాజా, సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ ఎస్ .వి. శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఐ.శ్రీదేవి వడ్లమాని పార్వతి, డాక్టర్ బి.వెంకటరాజు, జి.వి. శ్రీనివాస్ రావు, బోడపాటి ప్రసాద్, అతికల ప్రసాదరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక సేవా సంస్థల సభ్యులు భారీగా పాల్గొన్నారు.
