తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కడపలో వందమంది కళాకారులతో జాతీయ కవి సమ్మేళనం కూచిపూడి నృత్య ప్రదర్శన సినీ సంగీత విభావరి
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ గ్రంథాలయం కడపలో వందమంది కళాకారులతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జాతీయ కవి సమ్మేళనం, కూచిపూడి నృత్య ప్రదర్శన సినీ సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. తెలుగు కళా రత్నాలు అధ్యక్షురాలు మాడుగుల రత్నకుమారి,సీఈవో డాక్టర్ యు వి రత్నం, జాతీయ కన్వీనర్ అవార్డుల కమిటీ డైరెక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో 100 మంది కవులు కళాకారులు, గాయనీ – గాయకులు, కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరింపజేశారు.100 మంది కళాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు మెమొంటో శాలువా పూలమాల సర్టిఫికెట్లతో విభిన్న రంగాల ప్రముఖుల సమక్షంలో అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు.