తణుకు పట్టణంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్ నందు జరిగిన “బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ” (Recalling Nara Chandrababu Naidu Manifesto చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకుతెస్తూ) ప్రకాశం జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు ” కారుమూరి వెంకట నాగేశ్వరరావు” అధ్యక్షతన తణుకు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణ రాజు గారు, నర్సాపురం పార్లమెంట్ ఇంచార్జి శ్రీమతి గూడూరి ఉమాబాల గారు, సంచార సంఘాల వ్యవస్థ అధ్యక్షులు పెండ్ర వీరన్న గారు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు, మండల అధ్యక్షులు,జడ్పీటీసీ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.