క్షయ రోగులను దత్తత తీసుకున్న జనసేన శ్రేణులు
రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చిన పిలుపుమేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్షయరోగులకు పౌష్టికాహారం అందజేసి దత్తత తీసుకునే విధంగా వారు ముందుకు వచ్చారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో టీబీ ఇంటెన్సీ ఫైట్ క్యాంపైనింగ్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను మంగళవారం పంపిణీ జరిగింది. జనసేన జిల్లా కార్యదర్శి సాదా వెంకట్ కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన ముగ్గురు టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారికే ఆరు నెలల పాటు పోషకాహారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కొవ్వూరు డివిజన్ కానూరు టిబి యూనిట్
ఎస్ టి ఎస్ జి.ఆశాజ్యోతి దాతలను అభినందించారు. అలాగే ప్రతి గ్రామంలోనూ దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.తేజశ్రీ మాట్లాడుతూ టిబి వ్యాధి నివారణ మందులు వాడుతున్న రోగులు పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని తెలిపారు, ప్రభుత్వం క్షయపరీక్షలు మందులు ఉచితంగా ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంచారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసం వెంకన్న, దాసం మాణిక్యం, హనుమంతు నాగేశ్వరరావు, సెక్రెటరీ పి.గౌరీ ప్రియ, ఎం పి హెచ్ ఎస్. కె. నాగేశ్వరరావు
సి హెచ్ ఓ పాతూరి స్నేహ, ఎం పి హెచ్ ఎ. జి. దుర్గాప్రసాద్, ఏఎన్ఎం, టి.రాజేశ్వరి, 104 సిబ్బంది
కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.