మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మంగళవారం తణుకు పట్టణంలో వైఎస్సార్ మునిసిపల్ పార్క్ నందు, ఇరగవరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనారు. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కరపత్రాలను పంపిణీ చేసారు.
