విశాఖపట్నం: జూలై 8 (కోస్టల్ న్యూస్)
దివంగత నేత వైయస్సార్ 76వ జయంతి వేడుకలు 41 వ వార్డులో ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన 41 వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి స్థానిక వైసిపి శ్రేణులు పూలమాలలు వేసి జోహార్ వైయస్సార్ అంటూ నివాళులర్పించారు. ఆయన పేదలకు చేసిన సేవలు స్మరించుకున్నారు. రైతు బాంధవుడిగా, విద్యార్థులకు విద్యా ప్రదాతగా, పేదల ఆరోగ్య ప్రదాతగా స్థిర స్థాయిగా నిలిచిపోయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కొనసాగిస్తామని వెల్లడించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ఇచ్చిన సంక్షేమ పథకాలు రూపాయి అవినీతి లేకుండా నేరుగా పేదల ఖాతాల్లోకి చేరవేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్నిదేనన్నారు. నాడు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. ప్రజలు గుండెచప్పుడు తెలుసుకున్న నేతలు వైయస్సార్, ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదలకు న్యాయం చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41 వ వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు, మహిళ నాయకులు స్థానికులు పాల్గొన్నారు.