దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కెవి సూర్యనారాయణ ఆధ్వర్యంలో
విశాఖపట్నం: జూలై 8 (కోస్టల్ న్యూస్)
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా. వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భముగా పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డి ఆదేశాలు మేరకు దక్షిణ నియోజకవర్గం జగదాంబ సెంటర్ దగ్గర గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి దక్షిణ నియోజకవర్గ ఇంచార్జి కేవీ సూర్యనారాయణ( కె వి ఎస్ ) పూలమాల వేసి నివాళులు అర్పించారు మన దివంగత మాజీ సీఎం స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చేసిన రైతు రుణమార్పిడి, 108,ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నో పథకాలు తీసికొచ్చిన మహానుభావుడు వైస్సార్, అలాగే అయన కోరిక రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయటం, అయన కోరికతీర్చటానికి మన షర్మిలమ్మ , అయనరూపములో మనకు వచ్చిన అదృష్టం, మనం అందరం ఆమెకు సపోర్టుగా నిలిచి రాహుల్ గాంధీ ని ప్రధానిమంత్రి ని చేయటానికి నేటి నుండి కలసికట్టుగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమములో ఎస్సీ సెల్ అధ్యక్షులు కస్తూరి వెంకటరావు, సేవాదల్ చైర్మన్ చెన్నా అప్పారావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు హర్సద్ బాషా,అడ్వకేట్ రామదాస్, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, కాకర అప్పారావు, వెంకటేష్, వెంకటరావు, కార్యకర్తలు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు.