విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష తణుకు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన మీ సమస్య మా పరిష్కారం ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. లో ఓల్టేజి సమస్యను పరిష్కరించడానికి ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ కోతలు నివారించడంతోపాటు విద్యుత్ కోతలు సమయాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
