పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గురువారం జరిగిన బాబు బ్యూటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు కార్యకర్తలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను, అక్రమ కేసులను భరిస్తున్నారని, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్నేతలని అన్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను దగా చేసిందని, ప్రజలలోకి వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను మోసం చేసిన హామీలను ప్రతి గడపకు చేరవేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కఉరు శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణమరాజు, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీమతి గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమెల్లి వెంకటరాయుడు, పాలకొల్లు నియోజకవర్గం ఇన్చార్జి గుడాల హరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
