- రైతుల కష్టాలు పట్టని పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అనిపించుకున్నాడు!
- చేతనైతే అర్హులందరికీ పథకాల అందజేయండి!
- ” కోడిగుడ్ల” ఆధ్వర్యంలో భారీగా హాజరైన ప్రజానీకం
41వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ లో వాసుపల్లి
విశాఖపట్నం: జూలై 27 (కోస్టల్ న్యూస్)
ఇగోతో జగనన్న పథకాలు అమలు చేయలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 41 వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద ఆదివారం బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు చేసుకున్న అరాచక పాలనపై ఓర్వలేక ఇగో తో సభ వేదిక టెంటలు కూడా పీకించడానికి వెనుకాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. నేడు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఇంతమంది ప్రజానీకం హాజరు కావడం కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమవుతుందన్నారు. చిన్నపిల్లల నుండి మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వంనికి సిగ్గుండాలన్నారు. పొగాకు, మామిడి, టమోటా రైతులు గిట్టుబాటు ధర లేక వారి చమటతో పండించిన పంటను రోడ్డున పడేసుకుంటే పవన్ కళ్యాణ్ ఆయన సొంత సినిమాలకు ప్రమోట్ చేసుకోవడానికి పరిమితమయ్యాడన్నారు. జగన్ పేరు కానీ, ఆయన ఫోటో కానీ కనిపించకూడదని ఆయన అందించిన సంక్షేమ సంచలన పథకాలు కూడా ఇగో తో పేదలకు అందజేయకపోవడం దారుణమన్నారు. నాడు కులం మతం పార్టీలు చూడకుండా రెండున్నర లక్షల కోట్లు అవినీతి రహితంగా పేద ప్రజలకు అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకొని ఇగో పక్కన పెట్టి అర్హులైన పేద ప్రజలందరికీ తక్షణమే సంక్షేమ అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ 41 వ వార్డులో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నాడు ఎమ్మెల్యే వాసుపల్లి ప్రోత్సాహంతో రెండు కోట్లకు పైగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వార్డు ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజలు పక్షాన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉందని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రామానంద్, బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, 42వార్డు అధ్యక్షుడు బీసెట్టి ప్రసాద్, 41 వ వార్డు సీనియర్ క్రిస్టియన్ మైనార్టీ సెక్రటరీ విభాగం వేలంగిని రావు, లక్కోజ్ కుమార్, అన్నపూర్ణ, కే దేవి, సిహెచ్ ఈశ్వరి, పి భవాని, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.