విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్)
ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వందమందిలో కేవలం నలుగురికి లబ్ధి జరుగుతుంది మిత్రులారా, ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే, ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలు, నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా, మోడీ, చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మిత్రులారా, ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన హామీలను, పక్కదోవ పట్టించేందుకే, రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు, టార్గెట్ చేస్తూ తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, దళితులందరికీ హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మేనమామ అయినటువంటి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయంపై నోరు మెదపకపోవడం, అత్యంత దారుణం, ఎస్సీ వర్గీకరణ పేరుతో, ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ కులాలన్నీ నిరంతరం కొట్టుకుచస్తూ, రాజ్యాధికారం వైపు కనీసం కన్నెత్తకుండా, వుండే విధంగా కుట్ర పన్నాయి. మిత్రులారా ఈ రాజకీయ పార్టీ, నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు, ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శాంతియుత నిరంతర పోరాటం తప్పదు, ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్ బాబు, కొండ్రు కళ్యాణ్, నెల్లి సూరిబాబు, తనికెళ్ళ నాని, గుడాల శివ తదితరులు పాల్గొన్నారు