హాజరైన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరు పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సొసైటీ ఛైర్మన్గా పెనుమర్తి మోహన్, సభ్యులుగా వీరవల్లి ఆంజనేయులు, పెన్నాడ గణేష్లతో జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వేల్పూరు మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు), ప్రస్తుత సర్పంచ్ విశ్వనాధం కృష్ణవేణి, ఉప సర్పంచ్ గుణ్ణం రాజారావు, నాయకులు ఆరిమిల్లి రాము, చిట్టూరి సునంద, వల్లూరి రామ్మోహన్రావు, రెడ్డి నరేంద్రప్రసాద్ దతితరులు పాల్గొన్నారు.