‘పరదా’కధ చాలా గొప్పగా ఉంటుంది

అనుపమ 2.0 ను చూడబోతున్నారు ‘పరదా’ మూవీ మిస్ కావొద్దు

స్ఫూర్తిదాయక ‘పరదా’
విశాఖలో సందడి చేసిన పరదా నటి అనుపమ పరమేశ్వరన్

విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్)

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ ఆమెతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలో వినూత్న తరహాలు పరదాలతో ప్రమోషన్ చేపట్టారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ పార్క్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘పరదా’ కథ సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ తిరుగుతుందని. తన ఊరిలోని కఠినమైన, మగవారికి మాత్రమే మద్దతు ఇచ్చే సంప్రదాయాల వల్ల విసిగిపోయిన సుబ్బు, ఓ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరు అపరిచితులు (దర్శన రాజేంద్రన్, సాంగీత) తో కలసి, ఓ ఎనర్జీతో నిండిన రోడ్ ట్రిప్‌కి వెళుతుంది. కానీ, కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిప్పుతుందన్నారు. ఇలాంటి ఇంట్రెస్ట్ కలిగే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నరు దర్శకుడు ప్రవీణ్ కండ్రెగుల కథ చెప్పగానే ఎంతో ఫ్రెష్ గా కనిపించిందని కచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ కథలో ఉన్నాయని అన్నారు. విశాఖ అంటేనే తనకి ఎంతో ఇష్టమైన ప్రాంతమని విశాఖలో తాను నటించిన చిత్రాలు ఘన విజయాన్ని అందించాలని అదే నమ్మకంతో ఈ పరదా చిత్రాన్ని ప్రమోషన్ టూర్ కూడా విశాఖ నుండి ప్రారంభించడం జరుగుతుందని కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖలో ఆర్కే బీచ్ అంటే తనకి ఇష్టమైన ప్రాంతమని సీ ఫుడ్స్ తనకి ఇష్టమైన ఫుడ్ గా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు.
అనంతరం దర్శకుడు ప్రవీణ్ కాండ్రేంగుల మాట్లాడుతూ ఈ కథ, పాతుకుపోయిన సంప్రదాయాలపై నేరుగా ప్రశ్నలు వేస్తూ, నిజాయితీగా సాగుతుందని అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందన్నారు.ఎం సుబ్బు పాత్రలో అద్భుతంగా నటించిందని దర్శనరాజేంద్రన్, సంగీత కూడా బలమైన నటనతో మెప్పించారన్నారు. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ, పల్లెజీవితానికి, హిమాలయాల అందాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ అందంగా చూపించిందని వివరించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కావాల్సిన ఇంటెన్సిటీని పర్ఫెక్ట్‌గా అందించరన్నారు. బలమైన ప్రొడక్షన్ విల్యూస్‌తో ‘పరదా’ ఒక పవర్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోందని అందరూ ఈ చిత్రాన్ని విజయాన్ని చేకూర్చాలని కోరారు. ప్రొడ్యూసర్ లు విజయ్, శ్రీధర్ లు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజున సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ప్రాణం పెట్టి పనిచేశాం అన్నారు. అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందని. ఈ సినిమాతో అనుపమ 2.0 చూడబోతున్నాం అన్నారు. 100% చెప్తున్నాము ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఆగస్టు 22 అందరం థియేటర్స్ లో కలుద్దాం అని పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link