సరస్వతి పార్క్ వద్ద ప్రిన్స్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్)

ప్రముఖ నటుడు ఫ్రెండ్స్ మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా విశాఖపట్నం సరస్వతి పార్క్ వద్ద గ్రేటర్ విశాఖ సిటీ వైట్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా వంశీ కి దుశ్శాలువతో సత్కరించే కేక్ కట్ కట్ చేయించారు. ఒకరికొకరు పరస్పరం తినిపించి ప్రిన్స్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మహేష్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అన్నారు. కష్టమనే మాట వినిపిస్తే ముందు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం ఉంటుంది అని, ఎంతోమంది చిన్నారులకు ప్రాణదానం చేస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు కి భగవంతుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ప్రతి ఏడాది విశాఖపట్నంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని ఈసారి ప్రత్యేకంగా జూబ్లీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వారికి అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిరాడం మన జీవితం గడుపుతూ గ్రామాలను దత్తత తీసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు గా మన్ననలు పొందుతున్న ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించిన మహోన్నతమైన వ్యక్తి ఘట్టమనేని మహేష్ బాబు ని నటనలో తనదైన శైలిలో నవతరం ప్రేక్షకులు నేర్పిస్తున్నారని ఆగిపోయే ఎంతోమంది చిన్నారుల ప్రాణాలకు నిరంతరాయంగా సహాయ సహకారాలు అందిస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కి భగవంతుడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డోప్ప రమణ, కాకి సోంబాబు, మన్యాల శ్రీనివాస్, జోరీగల గణేష్, నమ్మి గణేష్, కెజిహెచ్ శ్రీను, వెంకటరావు, బివికె స్వామి, వల్లీ శ్రీను, చిన్నవాలటర్ శ్రీను, తదితరులుపాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link