ఆల్కహాల్, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలపై అవగాహన కార్యక్రమం

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యం లో తణుకు సాయి శ్వేత హాస్పిటల్ నందు కేర్ కమిటీ అవగాహన కార్యక్రమం
తణుకు పట్టణములో సాయి శ్వేత హాస్పిటల్ నందు తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కేర్ కమిటీ ఆల్కహాల్, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ నిమ్మల సత్యనారాయణ ఎమ్.ఎస్. డాక్టర్ శీలం శ్రీ అశ్విన్ కుమార్ ఎమ్.ఎస్ పాల్గొని ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల మానవుని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని ముఖ్యంగా వీటిని సేవించిన ఐదు నిమిషాల్లోనే మెదడు మీద ప్రభావం చూసి మనిషి విచక్షణను కోల్పోయేలాగా చేస్తాయని, మానవుడిలో ఆల్కహాల్ ముఖ్యంగా కాలేయం మీద ప్రభావం చూపి ఫ్యాటీ లివర్, లివర్ సి ర్రోసిస్ వంటి అనారోగ్య సమస్యలతో పాటు గొంతు సంబంధమైన , జీర్ణ వ్యవస్థ సంబంధమైన అనారోగ్యాలు, హృదయ సంబంధిత కండరాలు దెబ్బ తినటం, రక్తపోటు మరియు మధుమేహం నియంత్రణలో లేకపోవడం, మానవ శరీరంలో కార్సోజెనిక్ పదార్థాల యొక్క సాంద్రత పెరిగి వివిధ రకాల క్యాన్సర్లు చుట్టుముట్టటం జరుగుతుందని ప్రజలకు ఈ సందర్భంగా వివరించటం జరిగింది. డి అడిక్షన్ సెంటర్స్ లో నిష్ణాతులైన వైద్యుల సమక్షంలో తగిన చికిత్స తీసుకుంటే ఈ వ్యసనం నుండి బయటపడటం పెద్ద అసాధ్యమే మీ కాదని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఈ సమావేశంలో తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి మాదకద్రవ్యాల వలన కలిగే వ్యక్తిగత, సామాజిక దుష్ప్రభావాలను సైతం వివరించడం జరిగింది.

Scroll to Top
Share via
Copy link