విశాఖపట్నం: ఆగస్టు 10 (కోస్టల్ న్యూస్)
వార్తలకే పరిమితం కాకుండా, సమాజ హితాన్ని తన వృత్తి కంటే ముందు ఉంచి పనిచేస్తున్న సీనియర్ మహిళా జర్నలిస్టు, ఆంధ్రా వాయిస్ స్టాఫ్ రిపోర్టర్ వీరలత (శ్రీలత) అందరికీ ఆదర్శం. తోటి జర్నలిస్టులే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, వెంటనే స్పందించి సహాయం చేయడం ఆమెకు అలవాటు తన సంపాదనలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు కేటాయించడం ఆమె ప్రత్యేకత. అనాధలు, అభాగ్యులు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఆమెకు జీవన విధానమే.
అన్నదానం వంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే శ్రీలత, అన్ని హన్నా బాలికల సంరక్షణ కేంద్రంలో దాదాపు 50 మందికి పైగా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె ఆరోగ్యసుఖాలు కలగాలని ఆశీర్వదించారు. సేవా హృదయం, వృత్తి నిబద్ధత, మానవతా విలువలను కలిపి జీవిస్తున్న శ్రీలత, జర్నలిస్టు సమాజానికే కాదు, అందరికీ స్ఫూర్తి దీపంలా నిలుస్తున్నారు అన్నది నిర్వివాదాంశం. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో తన వంతు సహకారం మరింత ఉండాలని అనేకమంది కోరుకుంటున్నారు.