మన రాజ్యాంగానికి సాటి ప్రపంచములో ఏరాజ్యాంగానికీ లేదు – ఆరిమిల్లి

తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాల అయిన సందర్భముగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలుతెలియజేసారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరాస్యాన్ని, అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుచూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశ ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్చా స్వాతంత్ర్యములు అనుభవిస్తున్నారు అంటే ఆరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top