తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దుచేసి sc.st సబ్ ప్లాన్ నిధులు అన్నీ కూడా పక్కతో పట్టించి ఆ వర్గానికి ఎంత అన్యాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమైనా అన్నారు.ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి పంచడం జరిగిందని అన్నారు. అలాగే బీసీలకు కూడా బడ్జెట్ కేటాయించి వారికి కూడా పంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ రోజు విద్యకు పెద్దపీట వేస్తూ దాదాపు 30 వేల కోట్ల రూపాయలు విద్యకు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని అన్నారు. అలాగే పంచాయతీ రాజు గాని జన వనరుల శాఖకు గాని, ఇరిగేషన్ కి గాని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో అటాయించడం జరిగిందని అన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దాదాపు 21 బిల్లులను ఆమోదించడం జరిగిందని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేలాగా మా ప్రభుత్వం ఉందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు అన్నిటిని కూడా అరికట్టే విధంగా మా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబ్లింగ్ హలో మనందరికీ తెలుసు అని అన్నారు. ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే వారి ఆస్తులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం స్వాధీనపరచుకుందని అన్నారు. ఎవరైతే ఆస్తులను లాక్కొని విధంగా ఉన్నారు వారికి ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వాటి నుంచి రక్షణ కల్పిస్తున్నామని అన్నారు.శాసనసభలో ఎప్పుడూ లేనివిధంగా అనేక చర్చలు జరిపి ఒక నిర్ణయాత్మకంగా ఈరోజు శాసనసభ సమావేశాలు జరిగినయి అన్నారు. దురదృష్టం ఏమిటంటే మమ్ములను రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని శాసనసభ సమావేశాలను బహిష్కరించడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి కేవలం తాడేపల్లి ప్యాలెస్కే పరిమితవ్వడం, 11 మంది శాసనసభ్యులు ఉంటే వారిని కూడా పంపించకుండా శాసనసభను అవమానించారని అన్నారు. ప్రతిపక్ష హోదా రాని తీర్పును ప్రజలు ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం శాసనసభకు రాకపోవడం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉన్నది అనేది కూడా అందరికీ తెలిసిందని అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు 23 సీట్లు వచ్చినా గాని అసెంబ్లీకి హాజరైనారని, అలాంటి సమయంలో అతనిని అవమానపరిచారని అయినను మిగిలిన ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీకి వచ్చారని అన్నారు.కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రాకుండా మొఖం చాటేసుకొని ఉన్నారని అన్నారు ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చేయలేదని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీకి ఉన్నటువంటి విలువలను పూర్తిగా తుంగలోకి తొక్కినారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజుకు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మాకు ప్రజలు తీర్పు ఇవ్వకపోయినా మాకు అన్ని ఇచ్చేయాలని , ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అని అన్నారు. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి రానటువంటి యూఎస్,ఎఫ్ బి ఐ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని ఈరోజు వెలికి తీసి ఏ విధంగా అవినీతి చేశాడో అనడం ఒక నిదర్శనం అని అన్నారు. దాదాపు 1750 కోట్లు రూపాయలు అవినీతి జరిగిందని ఎఫ్ బి ఐ రిపోర్ట్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆరోజు విద్యుత్ ఒప్పందాలలో సోలార్ విద్యుత్తు ఒప్పందాలలో అదానీ గ్రూప్ తో వీరంతా సాగించిందల్లా ఈరోజు ఎఫ్బీఐ కళ్ళకు కట్టినట్టు చెప్తుందని అన్నారు.జగన్మోహన్ రెడ్డి తండ్రిని అడ్డుపెట్టుకొని దాదాపు లక్ష కోట్లు సంపాదించి 35 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని అంతకుమించి అంతర్జాతీయ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడంటే అంత సిగ్గుగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు రాజకీయాలు చేస్తూ ఒక తీరని మచ్చని క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గుపడాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మోడీ, పవన్ కళ్యాణ్ ఒక సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని 2047 విజన్ ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.