తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో తణుకు పట్టణ ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ఎవరు ఏరూపంలో చూసినా సృష్టికర్త ఒక్కరే అని అన్నారు, ఆ సృష్టికర్త భగవంతుడు ఒక్కరే అని మనం తెలుసుకోవాలని అన్నారు.ఇటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఇండియన్ పబ్లిక్ స్కూల్ అధినేత హుస్సేన్ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో బహుశా మన తణుకు పట్టణంలోనే ముస్లిం కార్తీక వనసమారాధన కార్యక్రమం ఏర్పరచడం చాలా సంతోషకరం ఇదే ప్రప్రథమం అని అన్నారు. ఇటువంటి ఆలోచన హుస్సేన్ కి రావడం వెంటనే దానికి సంబంధించి ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఆయనకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. మన తణుకు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నదని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సోదరి భావంతో మన తణుకు పట్టణం ప్రశాంతత వాతావరణం కలిగిన తణుకు పట్టణం అని, అటువంటి తణుకు పట్టణంలో ఇలాంటి కార్యక్రమం వేదిక కావడం చాలా ఆనందంగా, అదృష్టంగా భావించాలని అన్నారు. రాజకీయాల్లో కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలందరూ కూడా ఈరోజు వారిలో ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు. జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో ఒక ఆందోళన ఏదో జరుగుతుంది అన్న ఆందోళన ప్రజల్లో ఉండేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్లు చేసుకుని లాగా ఎవరికీ ఎటువంటి ఆందోళన లేకుండా చేసేలాగా ఈరోజు అన్ని వ్యాపారాలు గాని ఉద్యోగస్తులు గాని వివిధవృత్తుల మీద ఆధారపడ్డవారు గానీ ఒక నమ్మకం ఉంచి ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తుని ఏర్పరచిందని వారుఅభిప్రాయపడుతున్నరని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయాలని కులమతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్ని రకాల కులమత విశ్వాసాలు కాపాడే లాగా కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా కూడా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మోడీ ప్రధానమంత్రిగా ఎటువంటి ఇబ్బందులకు తాను ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.తణుకు పట్టణంపట్టణం ప్రశాంతంగా ముందుకు వెళ్లాలని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
