అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా పూలదండలు వేసిన నివాళులర్పించిన షెడ్యూల్ కులాల రాష్ట్ర నాయకులు కొండే నాగేశ్వరావు. ఈ సందర్భంగా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, కట్టాకుల ప్రసాద్, రొట్టె రవితేజ, పడల గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మాతా రమాబాయి త్యాగం చీకటి మా బ్రతుకులలో వెలుగు, ప్రతి స్త్రీ మూర్తికి నువ్వు ఆదర్శం, ప్రతి భార్యకు నువ్వు ఆదర్శం, ప్రతి తల్లికి నువ్వు ఆదర్శం, ప్రతి బిడ్డకు నువ్వు ఆదర్శం, మీ వారసులుగా చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ గర్విస్తున్నా అని అన్నారు. అదేవిధంగా కొండె నాగేశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ కి ఎంతో అండగా నిలబడి అంబేద్కర్ ఆశలకి నిరంతరం తోడ్పాటు అందించిన మహాతల్లి రమాబాయి అంబేద్కర్ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
