తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ మండల ఇన్చార్జిలతో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కార్యాచరణ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.ముఖ్యంగా మన నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 12,506 ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారని, వారందరికీ చేరువయ్యి మన యొక్క కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరంని గెలిపించాలని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27వ తేదీన ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని సమయం కేవలం 20 రోజులు మాత్రమే ఉందని ఈ 20 రోజుల్లో ఓటర్లను మనం స్వయంగా కలిసి వారి యొక్క ఓట్లు మన కూటమి అభ్యర్థికి వేయించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. ఇన్చార్జికి ఇచ్చిన 50 ఓట్లను వారు దగ్గరుండి ఓటర్లను కలిసి మన కూటమి అభ్యర్థి గురించి అభ్యర్థించి ఓట్లు పడే విధంగా చేయాలని అన్నారు. మన నియోజకవర్గంలో ఉన్న 12506 ఓటర్లకు 18 పోలింగ్ స్టేషన్లు నియమించడం జరిగిందని అన్నారు. తణుకు పట్టణం మండలం కలిపి 12 బూతులు ఇరగవరం మండలం 3 బూతులు అత్తిలి మండలం మూడు బూతులు నిర్ణయించడం జరిగిందని అన్నారు. మన నియోజకవర్గంలో 271 మంది కూటమి తరపున ఇన్చార్జిలుగా నియమించారని ఒక్కొక్కరు 50 మంది చొప్పున ఓటర్లు వద్దకు వెళ్లి మన కూటమి అభ్యర్థిని గెలిపించే విధంగా కృషి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున మూడు పార్టీల నుంచి కూడా 271 మందిని ఇన్చార్జిలుగా నియమించడం జరిగిందని, టిడిపి నుంచి 164 మందిని జనసేన నుంచి 78 మందిని బిజెపి నుంచి 26 మందిని నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించడం జరిగిందని అన్నారు. మనం ఎన్నికల ప్రచారం చేస్తూ ఒక్కొక్క ఇన్చార్జికి ఇచ్చిన 50 మందిని కూడా కలిసి వారికి మన అభ్యర్థి గురించి తెలియజేసి ఓట్లు వేయించాలని కోరారు. ఒక్కొక్క ఇంచార్జి 50 మందిని కూడా రెండు మూడుసార్లు కలిసి ఓట్లు అడిగే విధంగా ఉండాలని అన్నారు. ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా వాటర్ ను మనమే స్వయంగా బూత్ వద్దకు తీసుకుని వచ్చి మన కూటమి అభ్యర్థికి ఓటు వేయించాలని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , మోడీ ముగ్గురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఇప్పటివరకు రాజకీయ పార్టీలు కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులే గెలవడం జరిగిందని, కావున మనమందరం కూడా తేలిగ్గా తీసుకోవడం లేదని ఇంతకు ముందు చరిత్ర తీసుకుంటే రాజకీయ అభ్యర్థులు గెలవడం చాలా అరుదుగా జరిగిందని కానీ మనం మొట్టమొదటిసారిగా పట్టభద్రులు ఎమ్మెల్సీకి గెలవడానికి కృషి చేయాలని అన్నారు, జరగబోయే ఎన్నికల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతిష్టాత్మకంగా చేయాలని అన్నారు.మిమ్మల్ని అందరిని ఇన్చార్జిలుగా ఎంపిక చేసి ఇక్కడికి పిలిపించడం జరిగిందంటే మీ మీద ఉన్న, నమ్మకం బాధ్యత అని అన్నారు. ప్రత్యర్థులకు దీటుగా మనమందరం కష్టపడి మన కూటమి అభ్యర్థిని గెలిపించడానికి మన వంతు కృషి చేయాలని అన్నారు. మనం అధికారంలో ఉన్నాం కదా అని అంత తేలికగా తీసుకునే అవకాశం లేదని, కష్టపడి పనిచేసే మన కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. అందుచేత ఇన్చార్జిన్గా మీకు ఇచ్చిన ఒక్కొక్కరికి 50 ఓటర్లను ఇంటి దగ్గరికి వెళ్లి అభ్యర్థించి వారి జాత ఓటు వేయించే బాధ్యత మీదని అన్నారు. ఈనెల 11 వ తారీకు నుంచి కూడా నేను కూడా డోర్ టు డోర్ తిరిగి మన కూటమి అభ్యర్థి గురించి గెలుపు కోసం కృషి చేస్తానని అలాగే మన అబ్జర్వర్ గారైన కిడారి శ్రావణ్ కుమార్ కూడా నాతో పాటు వస్తారని అన్నారు. సుమారు 8 నెలల తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.11 లక్షల కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోయాడని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రధానంగా రెండు ప్రాజెక్టులు చేసుకోవలసిన పని ఉందని పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఇన్చార్జులు పాల్గొన్నారు.
