ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్
స్వర్గీయ మన్యాల అప్పారావు జ్ఞాపకార్థం గత 23 సంవత్సరాలు నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతూ వస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ 29 వ వార్డు పలు ప్రాంతాల్లో చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ కి సాదర స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. అనంతరం చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన చేతులమీదుగా ప్రారంభించి ప్రజలందరికీ అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ తనదైన రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలకు సేవ చేయాలనే భావం సేవాతత్పరత కలిగిన వ్యక్తిగా మన్యాల శ్రీనివాస్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ప్రజలందరికీ సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతం అని ఎంత సేవ చేసినా ప్రతి ఏడాది ఇంకా కొత్తగా చేయాలనే తపన తనలో మరింత ఆసక్తిని కలిగిస్తుందని, ఒకవైపు రాజకీయాలు మరోవైపు ఈ సేవా కార్యక్రమాలు తనకు ఎంతో ఉల్లాసాన్ని వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శ్యామ్, గోపి కళ్యాణి, సదా శివరావు, నమ్మి సూర్యనారాయణ, కాయిత నర్సింగ్ రావు, వియ్యపు చిన్నారావు, జెరాక్స్ రమణ, దుక్క ప్రసాద్, కొండలరావు మాస్టారు, గంగరాజు, కీలని అప్పారావు, గుమ్మడి శ్రీను, డొక్కరి పోలి, వాడమోదుల వీర్రాజు, పీతల చిన్న, కోన బాబురావు, నాగ, డొక్కరి శ్రీను, వియ్యపు రాజు, ఉరుకుటి శ్రీను, పల్ల నారాయణరావు, బోర రాజు, బంగార్రాజు, పెందుర్తి గిరిబాబు, సారిపిల్లి పండు, పల్ల అశోక్, ఇల్లపు శ్రీను, పెసల శివ, జంప గురునాథ్, నడుపురి రాజు,పొలిపిల్లి పవన్, అద్దేపల్లి రాము, మురళి, రమేష్, వీరుబాబు, ఆంథోనీ నగర్ శంకర్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.