బొలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తాడేపల్లిగూడెం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బలుసులమ్మ ఆలయం, కస్పా పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయం, ముత్యాలమ్మపురం ముత్యాలమ్మ ఆలయం, భగత్ సింగ్ కాలనీలోని అనంతమ్మ అమ్మవార్ల ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు అన్నివేళలా అందరికీ ఉండేలా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట రాజా, జనసేన నాయకులు కార్యకర్తలు, ఆయా ఆలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
