యోగా జీవితానికి క్రమశిక్షణ నేర్పుతుంది

యోగా దినోత్సవం సందర్భంగా తణుకు బొమ్మల వీధి నందు గల అమ్మా భగవాన్ ధ్యాన మందిరం నందు ఇంపల్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమంలో వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ క్లాసులకు యోగా గురువుగా బెల్లం కొండ సత్యశ్రీ పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన చక్కని శిక్షణతో యోగా నేర్పించారు. శిక్షణతో పాటు యోగా విలువ లను కూడా వివరించారు. అనంతరం వావిలాల సరళాదేవి మాట్లాడుతూ యోగా గురించి మాట్లాడుతూ విద్యార్థులను ‌సత్యశ్రీ లా ఎదగాలన్నారు. యోగా జీవితానికి క్రమశిక్షణ నేర్పుతుంది అన్నారు. యోగా గురువు సత్యశ్రీని శాలువా పుష్పగుచ్చంతో వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు సత్కరించారు. ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్ కూమార్ మాట్లాడుతూ అతిథిగా హాజరైన సరళాదేవిని శాలువాతో సత్కరించి ఆమె సేవలను కొనియాడారు. సరళా దేవి దంపతులు ధ్యాన మందిరం పెద్దలు సుబ్బారావుని సత్కరించారు.

Scroll to Top
Share via
Copy link