ఏక్ దేశ్ మే…దో విధాన్…దో ప్రధాన్ ఔర్ దో నిషాన్…నహీ చలేగా నహీ చలేగా. మాజీ కేంద్రమంత్రి, జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. దేశంకోసం, ధర్మంకోసం ప్రాణాలు అర్పించిన నిస్వార్థ నాయకులు,తన మన బేధం లేకుండా దేశ సేవకే పాటుపడిన త్యాగమూర్తి బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని, పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గము, తణుకు టౌన్ 42 వ. బూత్ లో గల (హరి నిలయం) వద్ద దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ PBR) ముప్పిడి సుబ్బయ్య, బొడ్డు అప్పారావు ,కొడమంచిలి జితేంద్ర, పులమాల వీరభద్రం, బలబద్ర నాగ సూర్య ప్రకాష్ గుప్తా, సుద్ధుల పాండు, కార్యకర్తలు పాల్గొన్నారు.
