ప్రజా ఆరోగ్యానికి నేచర్ స్వచ్ఛంద సంస్థ సంజీవిని ప్రాజెక్ట్ కార్యక్రమాలు

నేచర్ డైరెక్టర్ ఎస్ వికాస్ బాలరాజు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఎస్బిఐ ఫౌండేషన్ వారి భాగస్వామ్యంలో అర్బన్ ఏరియా 20 స్లం ప్రాంతాలలో నేచర్ క్రియాశీల సంస్థ, ఎస్బిఐ (SBI) సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించబడుతున్నాయని, వైద్య సేవల్లో భాగంగా ప్రతి నెలా రెండు సార్లు డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, వెహికల్ ఆపరేటర్ లతో కూడిన వైద్య బృందం అర్బన్ స్లం ప్రాంతాలను సందర్శిస్తూ ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారిని సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫరల్ చేయడం ద్వారా అనేక కుటుంబాలు ఆరోగ్యంగా జీవించడానికి తోడ్పడుతోందని తెలిపారు అలాగే ఇప్పటివరకు 1142 మందికి వివిధ రకాల ఆరోగ్య సేవలు అందించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ స్లం ప్రాంతాలలో శానిటేషన్ డ్రైవ్స్, అవగాహన శిబిరాలు, ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ఆరోగ్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జీవీఎంసీ సిబ్బంది, వార్డు మెంబెర్స్, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కలిసి సహకరిస్తున్నారని వివరించారు.
వైద్య బృందం వివరాలు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల ఫార్మాసిస్ట్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ పార్వతి, నర్స్ కరుణ, వెహికల్ ఆపరేటర్ వాసు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link