- ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం..
- ఏలూరు ఎం.ఆర్.సి కాలనీలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
- హాజరైన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షేక్ నూర్జహాన్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు..
- పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ఎం.ఆర్.సి కాలనీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నేతృత్వంలో చేపట్టిన “సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షేక్ నూర్జహాన్, డిఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది బోయిన పెద్దిబోయిన శివప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. ఇంటింటి పర్యటనలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున మంజూరు చేసిన ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులు, కుష్టు రోగులకు రూ.6 వేలు, కిడ్నీ, కాలేయం, తలసీమియా బాధితులకు రూ.10 వేలు, పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు చొప్పున ప్రతి నెలా తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఎంపీ తెలిపారు.
