తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాధాకృష్ణ
స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ 2047 ప్రకారం తణుకు నియోజకవర్గం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. వివిధ రంగాల్లో కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్ ద్వారా సమీక్ష చేసి రూ. 2.18 లక్షలు తలసరి ఆదాయాన్ని రూ. 50 లక్షలకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు ప్రతి కుటుంబం పేదరికం గెలిచే విధంగా గ్రామాలు పట్టణాల్లో ఉన్న బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారిని వృద్ధులకు తీసుకురావడానికి ఆర్థికంగా స్థిరపడిన వారు ముందుకు రావాలని కోరారు. విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసే ప్రణాళికలో భాగంగా చైర్మన్ గా ఎమ్మెల్యేగా తనతో పాటు విద్యాశాఖ నుంచి జిల్లా స్థాయి అధికారిగా ప్రభాకర్, స్థానిక తహసిల్దార్లు, ఎంపీడీవోలు కమిటీలో ఉంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అధికారులు, ప్రజలు సమన్వయంతో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ తయారుచేసుకుని లక్ష్యాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.