పంచాయితీ సభలో ఎంపీటీసీ తన ప్రక్కన కూర్చోవడం పై సర్పంచ్ అభ్యంతరం.
దళితున్ని కాబట్టే సర్పంచ్ 4 సంవత్సరాలుగా పంచాయితీలోనికి రానివ్వలేదు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక సర్పంచ్ కులవివక్ష కారణంగా అదే గ్రామానికి చెందిన మరొక ప్రజాప్రతినిధికి తీవ్ర అవమానం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా సర్పంచ్ ప్రవర్తన ఒక దళిత ప్రజాప్రతినిధి నడిరోడ్డుపై బైఠాయించే పరిస్థితికి దమ్మెన్ను గ్రామము వేదిక అయింది. ఉండ్రాజవరం మండలం , దమ్మెను గ్రామంలో శుక్రవారం జరిగిన పంచాయతీ గ్రామసభ ఈ వివాదానికి కారణమయ్యింది. గ్రామపంచాయతీ సమావేశంలో వైసిపి కి చెందిన సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ సభలో తన ప్రక్కన ఎంపీటీసీకి కుర్చీ ఎలా వేస్తారు అంటూ పంచాయతీ కార్యదర్శి పై అగ్రహం వ్యక్తం చేస్తూ, వేసిన కుర్చీ తీస్తావా లేదా అంటూ కార్యదర్శి పై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాడు. సభలో అతనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి మీకు సమావేశం జరగాలా వద్దా తేల్చుకోమని కార్యదర్శిపై సర్పంచ్ ఒత్తిడి తీసుకు వచ్చాడు. సభ నుండి వెళ్లిపోతాను అని సర్పంచ్ అనడంతో, అదే సభలో పాల్గొన్న టిడిపి జనసేన వార్డు సభ్యులు సర్పంచ్‌తో ఎంపీటీసీ కూడా మీ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కదా అతను కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి, సభలో పాల్గొంటే ప్రతిపక్ష సభ్యులుగా మాకు లేని అభ్యంతరం మీకు ఎందుకని ప్రశ్నించారు.ఈ వ్యవహారంలో తీవ్రంగా అవమానించబడ్డ వైసీపీకి చెందిన ఎంపీటీసీ గడ్డం రామకృష్ణ తనకు జరిగిన అవమానానికి సర్పంచ్ క్షమాపణ చెప్పాలంటూ రాజమండ్రి తణుకు ప్రధాన రహదారిపై అంబేద్కర్ ఫోటోతో బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది, దళిత ఎంపీటీసీ నైనా తనను ఈ విధంగా అవమానిస్తారా అంటూ రోడ్డుపై నిరసనకు దిగగా ఈ విషయం తెలుసుకున్న దళిత ఎంపీటీసీ సామాజిక వర్గ ప్రజలు భారీగా తరలివచ్చి నిరసన ప్రదర్శనలో అతనికి మద్దతుగా నినాదాలు చేశారు. సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ క్షమాపణ చెప్పవలసిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పంచాయతీ కార్యాలయంలో లోపల ఉన్న సర్పంచ్ నీ బయటకు లాక్కొచ్చారు. ఎంపీటీసీ గడ్డం రామకృష్ణ కు క్షమాపణ లోపలికి పిలిచి చెబుతానని సర్పంచ్ ఎంపీటీసీ కాళ్లపై పడడంతో… ఇందుకు ఒప్పుకొని దళిత సామాజిక వర్గ ప్రజలు సర్పంచ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తీవ్ర రూపం దాల్చడంతో మండల తహసిల్దార్ ఎంపీడీవో వి. వి. వి.ఎస్.రామారావు, దమ్మున్నో పంచాయతీ కార్యాలయానికి చేరుకొని జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచిని వివరణ అడుగగా పంచాయతీ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ పక్కన ఒక ఎంపీటీసీ ఎలా కూర్చుంటారని పంచాయతీ కార్యదర్శిని అడిగినట్లు చెప్పగా, అందువల్లే కుర్చీ తీసివేయాలని సెక్రటరీకి తెలిపినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ ఇద్దరం ఒకే వైసిపి పార్టీకి చెందిన వారమైన సర్పంచ్ తనను అందరి ముందు తీవ్రంగా అవమానించాడని, గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నడు పంచాయతీలోకి అడుగుపెట్టనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో తహసిల్దార్ మాట్లాడుతూ ఒక సర్పంచ్ హోదాలో ఉండి మరొక ప్రజాప్రతినిధి అందరిలో అవమానించడం తప్పని, ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని సర్పంచ్ సత్యనారాయణ ఎంపీటీసీ రామకృష్ణకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. సర్పంచ్ గా ఎన్నో వివాదాల్లో తలదూర్చి క్షమాపణలు చెప్పడం అలవాటైన గురజర్ల సత్యనారాయణ అధికారులు పోలీసులు ప్రజలందరి ముందు ఎంపీటీసీ రామకృష్ణకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో విభాగం సద్దుమణిగింది.