యునైటెడ్ క్రీస్టి చర్చ్ సంఘాల లీగల్ అడ్వెజర్ గా నియమితుడినవ్వడం పూర్వజన్మ సుకృతం : అల్ఫా కృష్ణ
సంఘం సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానని ఎన్ఎడి యునైటెడ్ క్రీస్టి చర్చ్ సంఘాల లీగల్ అడ్వెజర్ గా నియమితులయిన బి ఎస్ కృష్ణ (ఆల్ఫా కృష్ణ) పేర్కొన్నారు.
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి గాంచి, ప్రత్యేక గుర్తింపు పొందిన ఎన్ ఎ డి యునైటెడ్ క్రీస్టి చర్చ్ సంఘాల లీగల్ అడ్వెజర్ గా తనను నియమించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్బంగా చర్చ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని బాధ్యతలను ఆయన స్వీకరించారు. అనంతరం అల్ఫా కృష్ణ మాట్లాడుతూ 42 సంవత్సరాలు చరిత్ర గల ఎన్ ఎ డి యునైటెడ్ క్రీస్టి చర్చ్ విశాఖజిల్లా లో మూడు ప్రాంతాలలో విస్తరించిందన్నారు. నాడు ఓ గుడిసెలో ప్రారంభమై నేడు ఎన్ ఎ డి కొత్తరోడ్డు, నరవ, విమాన్ నగర్ లలో అతిపెద్ద చర్చ్ లను సంఘం నిర్వహిస్తుందని చెప్పారు. ఇంతటి ఘన చరిత్ర గల ఈ సంఘానికి తనను లీగల్ అడ్వెజర్గా నియమించడం ఎంతో ఆనందానిస్తుందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని రెట్టించిన ఉత్సహంతో సంఘం కార్యక్రమాలలో పాల్గొంటు చర్చ్ అభివృద్ధి లో పాలు పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులతో మమేకమై ఏకవాఖ్య నిర్ణయాలతో ముందుకుసాగుతానని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో యునైటెడ్ క్రీస్టి చర్చ్ సంఘాల కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం లో చర్చ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.