విజయవంతంగా బాబు షూరిటీ…. మోసాలు గ్యారంటీ!

దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బాబు షూరిటీ మోసాలు గ్యారెంటీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కేకే రాజు హాజరయ్యారు. మహానేత 76వ జయంతి సందర్భంగా ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగదాంబ జంక్షన్ లో గల రమేష్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దక్షిణ వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కోలా గురువులు వైయస్సార్సీపి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మోసాలకు పాల్పడడంలో 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు మరొక్కసారి నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నట్టెంట ముంచాడన్నారు. సూపర్ సిక్స్ అమలు చేసేసామని అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అంటూ వాసుపల్లి సవాల్ విసిరారు. ఇచ్చిన తల్లికి వందనం పథకం కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కనీసం 60 ఏళ్ల వృద్ధులకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. వితంతువు పింఛన్లు లో, వివిధ పథకాలలో గారడీలతో పేద ప్రజలకు అనర్హులను చేస్తూ పథకాలు ఎగ్గొడుతున్నారని వాసుపల్లి ఆరోపించారు. వాలంటీర్లకు 10,000 జీతాలు పెంచుతామని చెప్పిన ఉన్న లక్షలాది మంది యువత ఉద్యోగాలు రోడ్డుపాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు చెప్పేవి ఒకటి చేసేది మరొకటిని అన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ జగన్మోహన్ రెడ్డి నీ అధికారంలో లేకపోవడం వలన జరిగిన నష్టాన్ని, చంద్రబాబును మళ్లీ నమ్మి ఓటు వేయడం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పై ప్రజలకు వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి ఏడాది పాలనలో కోల్పోయిన సంక్షేమ పథకాలతో విస్తృత ప్రచారం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ అక్రమ కేసులతో రెడ్ బుక్కు రాజ్యాంగానికి నడిపిస్తే ఎవరు భయపడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఒక మాయల మరాఠీ అని దుయ్యబట్టారు. రాజకీయం అంటే కక్ష సాధింపులు కాదని, ప్రజలకు సేవ చేయడమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని, వచ్చే ఎటువంటి ఎన్నికలైనా గెలిచేది వైఎస్ఆర్సిపినే నని కేకే రాజు అన్నారు. కోలా గురువులు మాట్లాడుతూ వైయస్సార్ ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సంఘ సేవకులు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైయస్సార్ సిపి ఓటమిపై అధ్యయనం చేసుకుని, ఎగసిపడిన కెరటంలా మళ్లీ ప్రజల ఆదరణ పొందుతుందన్నారు. రాష్ట్ర నాయకులు ద్రోణం రాజు శ్రీ వాత్సవ మాట్లాడుతూ విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గాలతో పాటు 175 నియోజకవర్గాలు ఈసారి ప్రభంజనం సృష్టించబోతున్నామని జోష్యం చెప్పారు. దీనికి తొలి అడుగు వేసిన కూటమి ప్రభుత్వ ఏడాది వ్యతిరేక పాలనే నిదర్శనం అన్నారు. జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ప్రజా సేవకుడిగా, కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో అండగా ఉంటున్న వాసుపల్లి గణేష్ కుమార్ సారద్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడమే కూటమి ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు తోట పద్మావతి, చెన్నా జానకిరామ్, బిపిన్ జైన్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సనపల రవీంద్రభారత్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link