కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన, మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో మహిళలని ఎదుర్కొని గెలవలేక వ్యక్తిగత జీవితాలు మీద, క్యారెక్టర్ మీద అనవసరమైనటువంటి అంశాలను ప్రస్తావించి
మానసిక దాడి చేసి అణచివేసే ధోరణి వారి బలహీనతను తెలియజేస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ ఏకమై ఇటువంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి అనే విధంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాజీవితంలో సేవచేయాలన్నా రాలేనటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళలందరూ ఒకటిగా గళ మెత్తాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేసే నాయకులను సరైన సమయంలో, సరైన విధంగా బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నాను.
