ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవం సంధర్బముగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారి డాక్టర్ బి.దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రణాళిక బద్దమైన మాతృత్వం కోసం గర్భదారణల మద్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం ఉండాలని, తల్లి కావడానికి, సరైన వయస్సు శారీరకంగా, మానసిక ఆరోగ్యంగా ఉన్నపుడు మాత్రమే అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు. సరైన వివాహవయస్సు మగవారికి 25 , ఆడవారికి 21 సo.లు నిండాలని సూచించారు. ప్రజలు అందరూ కుటుంబ నియంత్రణ పద్దతులు పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది జనాభా దినోత్సవం ప్రాముఖ్యత తెలియజేస్తూ గ్రామంలో ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ నర్స్ కే‌డి‌వి‌ఎల్ కుమారి, సూపర్వైజర్ అనుపోజు శ్రీరామమూర్తి, సి.ఎచ్. మేరి రత్నకుమారి, మహిళా ఆరోగ్యకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link