దక్షిణంలో జనసేన పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్)
సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో 35వ వార్డు జనసేన ఇంచార్జ్, కుసురి శ్రీనివాస్, జనసేన 35 వ వార్డు ప్రెసిడెంట్ లంక త్రినాధ్ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ సంఖ్య లో చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో ఆంధ్రలో సూపరపాలనతో ముందుకు పోతుంది. ఈ క్రమంలో జనసేన విశాఖ సౌత్ గట్టి పట్టు ఉంది అని ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ నిరూపించుకుంటున్నారు. జనసేన అంటే పేదలా పార్టీని, ప్రతి సమస్య పై పోరాటం చేస్తుంది అని తెలిపారు.మహిళలు జనసేన లో ఎక్కువ సంఖ్య లో ఉన్నారని కొనియాడారు. 200 మంది జనసేనలోకి రావడంతో జనసేన కార్యాలయంలో పండగ వాతావరణం కనిపించింది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ప్రతి కార్యకర్త సమస్యను క్షుణంగా పరిశీలించి పరిష్కారం చూపించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.పార్టీ బలోపేతానికి ఆకుల లక్ష్మి, ఆర్టీవో శ్రీను, ఎస్ నగేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రఘు బెహరా అశోక్, బి. శ్రీను, జి. శ్రీను, మంగ, అరుణ మహిళా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.