తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్న ఏలూరు రేంజ్ ఐ.జి. అశోక్ కుమార్, ఆయనతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్ .వి.మురళీకృష్ణ, కొవ్వూరు డి.ఎస్.పి దేవకుమార్, నిడదవోలు సీఐ తిలక్, ఎస్సైలు శోభనకుమార్, జీ. సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది పొలీస్ అధికారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.