రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తణుకు నియోజవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగి, విదేశాల్లో విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిశ దశ నిర్దేశించినటువంటి మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే దానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం దినికి కారణం అన్నారు. ఒక కులానికో, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికో చెందినటువంటి వ్యక్తి కాదని భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని గుండె చప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఉండాలో ఒక దిక్సూచిని ఏర్పరచిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా నిధిని ఏర్పరిచి దళితులు పేదవారు విదేశాల్లో చదువుకునే ఒక మార్గాన్ని ఏర్పరచినటువంటి మహా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అంబేద్కర్ కి నివాళులర్పించారు.