విశాఖలో గీతా జయంతి సందర్భముగా గీతాఛానల్ ఫౌండేషన్, హైందవి ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష విద్యార్థులతో 100శ్లోకాలు,1000 స్కూల్స్ లో యువ గీత పారాయణం చేయించడం జరిగింది. గీతాఛానల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతా రత్న మండ విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్, జడ్పీ హై స్కూల్, వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలో విశాఖ డిఏవి పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం విశేషం. విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్ లో మాట్లాడుతూ భగవద్గీత పిల్లలను ఉద్దేశించి గీత పఠనం వలన ఉపయోగాలు మరియు గీత జయంతి అంటే హిందువులకు హత్యంత పవిత్ర దినం అని, గీతాజయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్షి మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజు వస్తుంది. ఈ రోజునే అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉచితంగా లక్ష భగవద్గీత పుస్తకాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మిశారద గీతా జ్ణానమువలన కలుగు ప్రయోజనములను వివరించారు.