సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు టి.వి9 రిపోర్టర్ రంజిత్, మరో వీడియో జర్నలిస్టు సూర్యం పై మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాము. తన కుటుంబంలో తెలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్ కి వెళ్ళగా జర్నలిస్టులపై మోహన్ బాబు భౌతిక దాడులకు దిగడం ఎంత మాత్రం సమంజసం కాదు. తన ప్రతాపాన్ని మీడియా పై చూపడం దారుణం. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ తరపున ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దాకా పోరాడుతామని హెచ్చరించారు.