ఖరీఫ్ పంట కొతలు ప్రారంభమైన నాటి నుండి తణుకు మండలములో ఇప్పటివరకు 13985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినదని తణుకు వ్యవసాయశాఖాధికారి కె.కుసుమ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు, తుఫాను ప్రభావంతో కోతలు నిలిపివేసిన రైతులతో మాట్లాడుతూ పంటకొనుగోలు శాతం ఇప్పటివరకు 60% వరకు జరిగినదని,రైతులనుండి ఏవిదమైన ఫిర్యాదులు లేవని గోనెసంచులు సమస్యలు కూడా లేవు, తేమశాతంకి సంభందించి 17% మించి వచ్చినట్లైతే ప్రతీ 1% కి 1కేజీ 75 కేజీ బస్తాకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ రెండు రోజులలో కొద్దిపాటి వర్షం నమోదు కావడంతో తేమశాతం పెరిగి కళ్ళంలో ధాన్యము తేమశాతం పెరిగే అవకాశం ఉంది కావున రైతులు వారి ఇష్టప్రకారం ప్రభుత్వ వెసులుబాటును ఉపయోగించుకుని ధాన్యము అమ్ముకోవాలని మండల వ్యవసాయధికారిని కె.కుసుమ తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఏ.ఏ.లు రైతులు పాల్గొన్నారు.