‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం అని గ్లోబల్ స్టార్ రాం చరణ్ అన్నారు. గేం చేంజర్ సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారాతో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
