ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్
పుస్తక పఠన ఆవశ్యకత బాహ్య ప్రపంచానికి తెలిపేలా పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొని అనంతరం పుస్తక స్టాళ్లను సందర్శించిన మంత్రి దుర్గేష్
ఏదేని ఒక విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించే విషయంలో పుస్తకాన్ని తలదన్నే పరికరం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి దుర్గేష్
పుస్తక మహోత్సవం ద్వారా పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో పుస్తక మహోత్సవం నిర్వహించాల్సిన అవసరం ఉందన్న మంత్రి దుర్గేష్.
కూటమి ప్రభుత్వంలో భాషా, కళా, సాంస్కృతిక, పుస్తక వికాసం జరుగుతుందని వెల్లడించిన మంత్రి దుర్గేష్.