ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శుక్రవారం నాడు ఆటో కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగినది ఈ సమావేశంలో కామన మునిస్వామి మాట్లాడుతూ ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఉన్నారని వారు స్వయంఉపాధితో ఆటోలను నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వము ఎటువంటి ఆర్థిక సహాయము చేయకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆటోలు కొనుగోలు చేయాలంటే ధరలు ఆకాశాన్ని అంటుకున్చున్నాయని అన్నారు. స్పేర్ పార్ట్స్, పెట్రోలు, డీజిల్ పెరిగాయని, ప్రైవేటు ఫైనాన్స్ లకు వడ్డీ రూపంలో అధిక మొత్తంలో చెల్లిస్తున్నారని ఆర్థికంగా కార్మికులు నష్టపోతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని మునస్వామి డిమాండ్ చేశారు .ఆటో కార్మికులకు ఆటోలు కొనుగోలు కు సబ్సిడీ తొ కూడిన రుణాలను బ్యాంకు నుండి ప్రభుత్వం ఇవ్వాలని మంజూరు చేయించాలని, ప్రతి కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి 5000 పెన్షన్ ఇవ్వాలని పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు .కార్మికులు ఐక్యంగా పోరాటాల సిద్ధంగా ఉన్నారని మునిస్వామి ప్రభుత్వాన్ని తెలిపారు. ఈ కార్యక్రమం లో యూనియన్ అధ్యక్షులు రేలంగి మెంటయ్య కార్యదర్శి నల్ల గోపి రాజేష్ ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
