నులిపురుగుల నివారణకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించే నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమంపై శుక్రవారం ఎంపీపీ స్కూల్ నం .1లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రోజా గ పిల్లలకు చేతులు శుభ్రం చేసుకునే దశలను వివరించి, ఎప్పుడెప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలో వివరించారు. ఏఎన్ఎం సరోజ గా ఆల్బండోజోలు మాత్రలు అందరూ వేసుకోవాలని , నులిపురుగులు ఏ విధంగా అనారోగ్యానికి కారణం అవుతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
