ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు విద్యాశాఖ, వైద్యశాఖ మరియు ఐసిడిఎస్ సిబ్బందితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు సమీక్షా సమావేశము నిర్వహించారు.
సదరు సమావేశము నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో అంగన్వాడీ పిల్లలకు అవగాహన కల్పించాలని ఆశవర్కర్స్ కి తగు సూచనలు ఇచ్చారు.
సదరు సమావేశమునకు మండల విద్యాశాఖ అధికారి 1, శ్రీ.ఎస్. శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి 2, శ్రీ.జి.ప్రసాద్ రావు, ఇరగవరం పిహెచ్సి వైద్య అధికారి, శ్రీ. క్రాంతి రెడ్డి, MPHEO శ్రీ. సురేష్, ఐసిడిఎస్ సూపర్వైసర్ శ్రీమతి.ఎన్.కాంతకుమారి మరియు ఆశ వర్కర్స్ హాజరయ్యారు.