నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు, తణుకు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు, శ్రీమతి డి. సత్యవతి పత్రిక ప్రకటన ద్వారా జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఆదేశముల మేరకు 2025 సంవత్సరానికి గాను నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, మొదటగా మార్చి 8 వ తేదీన ఈ సంవత్సరము మొదటి జాతీయలోక్ అదాలత్ కోర్టులు పనిచేయు ప్రతి చోటా నిర్వహిస్తున్నట్లు తెలియచేస్తూ జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం రాజీపడు కేసులు రాజీ చేయుట, కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని, సివిల్ కేసులలో కోర్టుకు కట్టిన కోర్టు ఫీస్ తిరిగి తీసుకునే అవకాశం ఉందని, ఈ జాతీయ లోక్ అదాలత్ లో ఈ క్రింది కేసులు రాజీ చేసుకోవచ్చని అవి క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, ప్రమిసరీ నోటు కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు తో పాటు ప్రి లిటిగేషన్ కేసులుగా బ్యాంక్ మరియు టెలీఫోన్ బకాయి కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు.
