విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్)
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని దుండి మహేష్ ( స్పోర్ట్స్) వారి ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ తో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మొక్కను నాటీ నీళ్ళు పోసారు అనంతరం మొక్కలు ప్రగతికి మెట్లు అని ఈరోజు మనం నాటిన చెట్లే రేపటి రోజున చెట్లు గా మారి అనంత జీవకోటికి ప్రాణవాయువునీ ఇస్తుంది అని రోజుకి పెరుగుతున్న కాలుష్య నివారణకు, సమతుల్యంగా మొక్కలు నాటి పర్యావరణహితాన్ని కాపాడాలని అందరికి సూచించారు.