సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అని అన్నారు. గురజాడ విద్యానికేతన్ ప్రిన్సిపల్ పాతూరి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ మనసుకు నచ్చిన నేస్తమే మంచి స్నేహితులకు రోజు స్నేహితుల దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా మరిచే స్నేహం చేయకు చేసే స్నేహం మరవకు అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు సదస్సు నిర్వహించి పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం విశ్రాంత గ్రంథాలయ అధికారి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య స్మారక పురస్కార్ గ్రహీత నున్న వెంకట రామారావును, శంకర్ విలాస్ అధినేత చేసెట్టి లలితా శంకర్, ప్రముఖ వ్యాపారవేత్త ఎమగల శివప్రసాద్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి మైపాల దుర్గాప్రసాద్, సబ్బెల్ల పల్లారెడ్డి, కూన్పల్లి నాగభూషణరెడ్డి, ఆకెళ్ళ శ్రీనివాసులు, సభ్యులు ముక్కామల మోహనరావు స్కూలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
