అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు లబ్ధి
తణుకు నియోజవర్గంలో 16,954 మందికి రూ. 11.46 కోట్లు సాయం
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
రైతులకు ఇచ్చిన హామీను కూటమి ప్రభుత్వం మరోసారి నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెద్ద పీట వేశరని అన్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో 16,954 మంది రైతులకు రూ.11.46 కోట్లు మేర సాయాన్ని వారి ఖాతాలోకి జమ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు మేలు చేసే విధంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, డీఎస్సీ నిర్వహణ, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమలు తదితర హామీలను అమలు చేయగా ఈనెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు వారి ఖాతాల్లో నిధులను జమ చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.